మా అమ్మ నన్ను డీజీపీగా చూసింది
ABN , Publish Date - May 04 , 2026 | 03:58 AM
తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ ఆదివారం తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. డీజీపీ సీవీ ఆనంద్ మాతృమూర్తి ..
తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న సీవీ ఆనంద్
హైదరాబాద్, మే 3: తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ ఆదివారం తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. డీజీపీ సీవీ ఆనంద్ మాతృమూర్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం మంచానికి పరిమితమయ్యారు. అయితే, తన తల్లి తనను డీజీపీగా చూసి ఆనందించారంటూ సీవీ ఆనంద్ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘మా అమ్మను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నా.. నవంబరు- జనవరి మధ్య కాలంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడిన ఆమె ప్రస్తుతం మంచానికే పరిమితం అయినప్పటికీ కోలుకున్నారు. తన కొడుకుని రాష్ట్ర డీజీపీగా చూడాలన్న వాంఛే ఆమెను నిలబెట్టిందని అనుకుంటున్నా. ఆమె ఎంతో సంతోషించారు. నేను కూడా అంతే’’ అంటూ సీవీ ఆనంద్ ఎక్స్‌లో పోస్టు చేశారు.