హామీల అమలుపై సందేహం వద్దు
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:14 AM
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు భాగస్వాములుగా ఉన్న లౌకిక ప్రగతిశీల కూటమి (ఎస్పీఏ) అభ్యర్థులను గెలిపించాలని...
దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమే
పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు భాగస్వాములుగా ఉన్న లౌకిక ప్రగతిశీల కూటమి (ఎస్పీఏ) అభ్యర్థులను గెలిపించాలని ఆ రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. పుదుచ్చేరిలోని మనవేలి, ఎం.బాలం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఎస్పీఏ ప్రకటించిన గ్యారెంటీలు అమలు సాధ్యమా అంటూ విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయని, అయితే ఆ సందేహాలకు సమాధానం తెలంగాణేనని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశం నుంచే గ్యారెంటీల అమలు ప్రారంభించామన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ రక్షణకు కాంగ్రె స్, డీఎంకే కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.