తెలంగాణలో సైబర్ నేరాలు తగ్గాయట!
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:38 AM
తెలంగాణలో 2 శాతం మేర సైబర్ నేరాలు తగ్గాయట! ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 24 శాతం పెరిగాయట! ఈ విషయాలను తాజాగా విడుదలైన సోషియో ఎకనామిక్ సర్వే- 2026లో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 24 శాతం పెరుగుదల
రాష్ట్రంలో మాత్రం 2 శాతం తగ్గుదల
సోషియో ఎకనామిక్ సర్వేలో వెల్లడి
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 2 శాతం మేర సైబర్ నేరాలు తగ్గాయట! ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 24 శాతం పెరిగాయట! ఈ విషయాలను తాజాగా విడుదలైన సోషియో ఎకనామిక్ సర్వే- 2026లో పేర్కొన్నారు. కేవలం నేరాల సంఖ్యను తగ్గించడమే కాకుండా, సైబర్ దాడుల వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం 23 శాతం నియంత్రించగలిగిందని సర్వే వెల్లడించింది. మహిళా భద్రతకు ప్రభుత్వం అమ లు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కూడా ఈ నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు సురక్షితంగా ఇళ్లు చేరడానికి ‘టీ సేఫ్’ వ్యవస్థ పటిష్టమైన రక్షణ కల్పిస్తోంది. గత ఏడాది కాలంలో షీ టీమ్స్ 18 వేల ఫిర్యాదులను స్వీకరించి, వాటన్నింటిపై శరవేగంగా స్పందిం చి బాధితులకు న్యాయం చేశాయి. వేధింపులకు గురైన వారికి బాసటగా నిలిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 35 భరోసా కేంద్రాలు నిరంతరం సేవలందిస్తున్నాయి. రాష్ట్రాన్ని మత్తు రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈగల్ ఫోర్స్’ సత్ఫలితాలను సాధిస్తోందని సర్వే వివరించింది.