Share News

తెలంగాణ పర్యాటకానికి జాతీయ గుర్తింపు

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:26 AM

నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన ‘దివ్య భారత్‌’ పర్యాటక నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు లభించడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైవిధ్య....

తెలంగాణ పర్యాటకానికి జాతీయ గుర్తింపు

  • హర్షం వ్యక్తం చేసిన మంత్రి జూపల్లి

నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన ‘దివ్య భారత్‌’ పర్యాటక నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు లభించడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైవిధ్య భరితమైన పర్యాటక సామర్థ్యానికి ఈ నివేదిక అద్దం పడుతుందని, ఇది తెలంగాణకు గర్వకారణమని ఆయన కొనియాడారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఆదిలాబాద్‌ జిల్లాలోని మారుమూల గోండుగూడ ఆదివాసీ ప్రాంతానికి చెందిన వారిని హైదరాబాద్‌ పర్యటనకు తీసుకువచ్చి చారిత్రక గోల్కొండ కోటతోపాటు ఇతర పర్యాటక ప్రాంతాల్ని చూపించనున్నారు. ఇందుకు సంబంధించిన ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్‌ ప్రోగ్రామ్‌’ను మంత్రి జూపల్లి కృష్ణారావు గోండుగూడలో బుధవారం ఉదయం లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. సుమారు 650 మంది ఆదివాసీలు హైదరాబాద్‌ను సందర్శించనున్నారు.

Updated Date - Apr 22 , 2026 | 05:26 AM