Share News

రూ.కోట్ల విలువైన భూముల్లో పేదలకు ఇళ్లు

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:17 AM

క్యూర్‌ పరిధిలో పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే అల్ప, మధ్య ఆదాయ వర్గాల కోసం లక్ష ఇళ్లను నిర్మించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

రూ.కోట్ల విలువైన భూముల్లో పేదలకు ఇళ్లు

  • 400 చదరపు అడుగుల్లో ఇంటి డిజైన్‌

  • క్యూర్‌లో లక్ష ఇళ్లపై సమీక్షలో మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): క్యూర్‌ పరిధిలో పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే అల్ప, మధ్య ఆదాయ వర్గాల కోసం లక్ష ఇళ్లను నిర్మించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను నిర్మించి, లబ్ధిదారుకు వచ్చిన వాటాను మహిళ పేరు మీద ఇవ్వనున్నట్టు ప్రకటించారు. శుక్రవారం క్యూర్‌ (కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ)లో లక్ష ఇళ్ల నిర్మాణాలపై సచివాలయంలోని తన కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ కార్యదర్శి వి.పి.గౌతమ్‌తో కలిసి సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక ఏడాదిలో క్యూర్‌ పరిఽధితో పాటు, ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తం 3.50 లక్షల ఇళ్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పేదల ఉపాధిని పట్టించుకోలేదని, నగరానికి 30-40 కి.మీ దూరంలో ఇళ్లను నిర్మించిందని విమర్శించారు. తమ ప్రభుత్వం పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని నిర్మించబోతున్నట్టు తెలిపారు. పేదల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒక్కో ఇల్లు కనీసం 400 చ. అ. విస్తీర్ణంలో ఉండేలా డిజైన్‌ రూపొందించాలని ఆదేశించినట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - Jun 06 , 2026 | 04:17 AM