Share News

నిబద్ధతతో పనిచేయండి

ABN , Publish Date - Jul 03 , 2026 | 07:06 AM

రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సంజ య్‌ జాజును గురువారం సచివాలయంలో తెలంగాణ గ్రూప్‌-1 అధికారుల సంఘం అధ్యక్షుడు..

నిబద్ధతతో పనిచేయండి

  • గ్రూప్‌-1 అధికారులకు సీఎస్‌ సూచనలు

  • డిప్యూటీ సీఎం భట్టితో మర్యాద పూర్వక భేటీ..

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సంజ య్‌ జాజును గురువారం సచివాలయంలో తెలంగాణ గ్రూప్‌-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి హన్మంతు నాయక్‌ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. గ్రూప్‌-1 అధికారులు నిబద్ధతతో పని చేసి, ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించడం, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంలో గ్రూప్‌-1 అధికారుల పాత్ర కీలకమని.. అందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. కాగా, సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను సంజయ్‌ జాజు కలిశారు. సీఎ్‌సగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి ఆయన మర్యాద పూర్వకంగా భట్టితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎస్‌కు భట్టి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jul 03 , 2026 | 07:07 AM