Share News

మెడికల్‌ టూరిజం అభివృద్ధికి ప్రణాళిక రూపొందించండి: సీఎస్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:41 AM

తెలంగాణ టూరిజం పాలసీ-2025-30లో భాగంగా మెడికల్‌ వెల్‌నెస్‌ టూరిజం అభివృద్ధికి సమగ్ర వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు.

మెడికల్‌ టూరిజం అభివృద్ధికి   ప్రణాళిక రూపొందించండి: సీఎస్‌
sanjay jaju

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ టూరిజం పాలసీ-2025-30లో భాగంగా మెడికల్‌ వెల్‌నెస్‌ టూరిజం అభివృద్ధికి సమగ్ర వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలు, ఆధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ‘నేషనల్‌ అక్రెడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌ (ఎన్‌ఏబీహెచ్‌)’ గుర్తింపు పొందిన ఆస్పత్రులు 89, ‘జాయింట్‌ కమిషన్‌ ఇంటర్నేషనల్‌(జేసీఐ)’ గుర్తింపు పొందిన ఆస్పత్రులు ఎనిమిది ఉన్నాయన్నారు. వివిధ దేశాల నుంచి వైద్య చికిత్సల కోసం రోగులు హైదరాబాద్‌కు వస్తున్నారని తెలిపారు. ఇది మెడికల్‌ టూరిజం అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 06:41 AM