Share News

పెట్టుబడులు పెట్టేవారికి సహకరిస్తాం: సీఎస్‌

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:13 AM

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా సహకరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు చెప్పారు.

పెట్టుబడులు పెట్టేవారికి సహకరిస్తాం: సీఎస్‌

  • సీఎస్‌తో అమెరికా-ఇండియా భాగస్వామ్య ఫోరం భేటీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా సహకరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఆయనతో అమెరికా-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పదేళ్ల కాలంలో సాధించిన ఆర్థిక, సామాజిక పురోగతిని సీఎస్‌ ప్రతినిధులకు వివరించారు.

Updated Date - Apr 08 , 2026 | 06:13 AM