Share News

కాంట్రాక్టర్లకు మూడేళ్లుగా చెల్లింపుల్లేవ్‌

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:35 AM

రాష్ట్రంలో మూడేళ్ల నుంచి వివిధ శాఖల పరిధుల్లో చేపట్టి, పూర్తయిన పనులకు సంబంధించి దాదాపు రూ.20వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా....

కాంట్రాక్టర్లకు మూడేళ్లుగా చెల్లింపుల్లేవ్‌

  • ప్రభుత్వం నుంచి రూ.20వేల కోట్ల బిల్లులు పెండింగ్‌..

  • 18న కాంట్రాక్టర్ల మహాసభ

  • బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నేత డీవీఎన్‌ రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడేళ్ల నుంచి వివిధ శాఖల పరిధుల్లో చేపట్టి, పూర్తయిన పనులకు సంబంధించి దాదాపు రూ.20వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఏఐ) మాజీ ఉపాధ్యక్షుడు డీవీఎన్‌ రెడ్డి తెలిపారు. ఈ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు ప్రభుత్వం మూడేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయంలోని మీడియా సెంటర్‌ దగ్గర పలువురు కాంట్రాక్టర్లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్టర్లు అప్పులు చేసి మరీ పనులు చేశారని, చెల్లింపులు ఆగిపోవడంతో అప్పు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. చాలా కంపెనీలు మూతపడే పరిస్థితిఉందని, కొంతమంది కాంట్రాక్టర్లు ఒత్తిడితో గుండెపోటుకు గురయ్యారని, కొంద రు ఆత్మహత్య కూడా చేసుకున్నారని వివ రించారు. పనులు చేసిన ప్రకారంగా పెం డింగ్‌ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌ బిల్లుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 18న రాష్ట్రంలోని కాంట్రాక్టర్లంతా కలిసి హైదరాబాద్‌లో ‘మహాసభ’ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ మహాసభలో తదుపరి కార్యాచరణను రూపొందిస్తామన్నారు. మహాసభ పోస్టర్‌ను డీవీఎన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ప్రతీ నెల చెల్లింపులు చేసినట్లుగా.. ఇప్పుడు కూడా శాఖలవారీగా బిల్లులను చెల్లించాలని కోరారు.

Updated Date - Jun 04 , 2026 | 05:35 AM