Share News

అమ్మాయిల దుస్తుల గురించేనా..అబ్బాయిల పెంపకాన్ని ప్రశ్నించరా?

ABN , Publish Date - May 22 , 2026 | 04:28 AM

భారతీయ సమాజంలో మహిళలపట్ల ఎంత చిన్నచూపు ఉన్నదో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు వ్యవహారంలో మరోసారి ....

అమ్మాయిల దుస్తుల గురించేనా..అబ్బాయిల పెంపకాన్ని ప్రశ్నించరా?

  • బండి భగీరథ్‌ కేసుపై కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మీనాక్షి

హైదరాబాద్‌, మే 21(ఆంధ్రజ్యోతి): భారతీయ సమాజంలో మహిళలపట్ల ఎంత చిన్నచూపు ఉన్నదో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు వ్యవహారంలో మరోసారి బయటపడిందని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ అన్నారు. ద్రవిడ ఉద్యమ సిద్ధాంతకర్త పెరియార్‌ చెప్పినట్లుగా ఒకే కులంలో కూడా శ్రేణీకరణలో అట్టడుగున ఉన్నవారే ఎక్కువగా నష్టపోతారని, ఇందులో మహిళల పరిస్థితి మరీ దారుణ ంగా ఉంటుందని సోషల్‌ మీడియా వేదికగా ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనపై వచ్చిన కొన్ని అసహ్యకరమైన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిందితుడితోనే బాధితురాలికి పెళ్లి చేయాలని సూచించడం, అమ్మాయిల పెంపకమే దాడులకు కారణంగా చూపించడం, దుస్తుల ఎంపికను నిందించడం సర్వసాధారణమైపోయిందని మండిపడ్డారు. నిందితుడి పెంకకాన్ని ఎవరూ ప్రశ్నంచరని అన్నారు. రాజకీయ పార్టీలు అంతర్గతంగా సురక్షిత వాతావరణం సృష్టించి.. సామాజిక, లింగ న్యాయ అవగాహన కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Updated Date - May 22 , 2026 | 04:28 AM