Share News

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:11 AM

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన పోషకాలతో కూడిన అల్పాహారం...

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

  • ఇంటర్‌ విద్యార్థులకు భోజన సదుపాయంపై హర్షం

హైదరాబాద్‌, మార్చి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన పోషకాలతో కూడిన అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని అందిస్తామని శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

Updated Date - Mar 21 , 2026 | 05:11 AM