సాధారణ ట్రాఫిక్‌లో సీఎం కాన్వాయ్
ABN , Publish Date - May 08 , 2026 | 07:00 AM
సీఎం రేవంత్‌రెడ్డి సాధారణ ట్రాఫిక్‌లో ప్రయాణించి, తన కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలనే తన నిబద్ధతను చాటుకున్నారు.
సింగిల్ లైన్ విధానంలో విమానాశ్రయం నుంచి ఇంటికి
హైదరాబాద్/శంషాబాద్ రూరల్, మే 7 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి సాధారణ ట్రాఫిక్‌లో ప్రయాణించి, తన కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలనే తన నిబద్ధతను చాటుకున్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని గురువారం ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసానికి వెళ్లే మార్గంలో సాధారణ ట్రాఫిక్‌తో పాటే సీఎం కాన్వాయ్ ప్రయాణించింది. తన కాన్వాయ్ కోసం ప్రత్యేకంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించవద్దని అధికారులను ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసు కమిషనర్లు, ట్రాఫిక్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ సీవీ ఆనంద్.. వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎక్కడా ట్రాఫిక్ నిలిపి వేయకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. సింగిల్ లైన్ విధానాన్ని అమలు చేస్తూ, లేన్ డిసిప్లేన్ పద్ధతిలో సాధారణ వాహనాలతో పాటే సీఎం కాన్వాయ్ వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.