నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:42 AM
సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ నివాసంలో జరగనున్న ఓ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. అనంతరం ఏఐసీసీ అగ్రనేతలతోనూ సమావేశమయ్యే అవకాశాలున్నాయని సమాచారం.
సీఎంను కలిసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ నివాసంలో జరగనున్న ఓ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. అనంతరం ఏఐసీసీ అగ్రనేతలతోనూ సమావేశమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ఇటు సీఎం రేవంత్‌ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలిశారు. సోమవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో రేవంత్‌ను కలిసిన రాజగోపాల్‌రెడ్డి.. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మాట్లాడారు. అయితే మంత్రివర్గంలో చోటును ఆశిస్తున్న రాజగోపాల్‌రెడ్డి ఇటీవల పలుమార్లు వివాదాస్పద ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సీఎంను కలవడం ఆసక్తిని రేపింది. కాగా, రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకుగాను సీఎం రేవంత్‌కు విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, అద్దంకి దయాకర్, వెంకట్ బల్మూరి.. ఎమ్మెల్యేలు బాలూ నాయక్, పాయం వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు.