Share News

పరిశుభ్రత-పచ్చదనమే ఎజెండా

ABN , Publish Date - Mar 08 , 2026 | 05:46 AM

‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు.

పరిశుభ్రత-పచ్చదనమే ఎజెండా

  • ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో పంచాయతీరాజ్‌ కార్యక్రమాలు

  • 99 రోజుల పాటు రాష్ట్రమంతటా చేపట్టాలి: రేవంత్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు. ఇందులో పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖ కీలక పాత్ర పోషించనుంది. ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించనుంది. పరిశుభ్రత-పచ్చదనం ఎజెండాగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. తాగు నీరు, చెత్త నిర్వహణ, ఉపాధి హామీ, రాబోయే వర్షాకాల ముందస్తు పనులపై దృష్టి పెట్టే ప్రణాళికను తయారు చేసింది. ఏ రోజుకారోజు విభిన్న కార్యక్రమాలతో జనంలోకి వెళ్లేందుకు వీలుగా షెడ్యూలును రూపొందించుకుంది. సుపరిపాలనతో గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.

Updated Date - Mar 08 , 2026 | 05:47 AM