ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:16 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం ముంబయి నుంచి ఢిల్లీకి చేరుకున్న సీఎం నేరుగా తుగ్లక్‌రోడ్‌లోని తన నివాసానికి చేరకున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం ముంబయి నుంచి ఢిల్లీకి చేరుకున్న సీఎం నేరుగా తుగ్లక్‌రోడ్‌లోని తన నివాసానికి చేరకున్నారు. సోమ, మంగళవారాల్లో ఢిల్లీలోనే ఉండనున్న ముఖ్యమంత్రి.. ఈ సందర్భగా పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. కేంద్ర రసాయన, ఎరువుల మంత్రి జేపీ నడ్డా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం రేవంత్ కలిసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఖరీఫ్ సీజన్ రావడంతో రాష్ట్ర రైతులకు ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవడంపై జేపీ నడ్డాకు, ఇటీవల రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్ర రక్షణ శాఖ అనుమతివ్వడంతో రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతారని ఆ వర్గాలు తెలిపాయి.