నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - May 06 , 2026 | 07:23 AM
సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా మెట్రో ఫేజ్-2 విస్తరణ పనులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధుల సాధనపై...
మెట్రో విస్తరణపై కేంద్ర మంత్రితో భేటీ
అధిష్ఠానం పెద్దలనూ కలిసే చాన్స్
హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా మెట్రో ఫేజ్-2 విస్తరణ పనులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధుల సాధనపై దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ కట్టర్‌ను రేవంత్‌రెడ్డి కలుస్తారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్తు కొనుగోళ్లలో అక్రమాలపై రాష్ట్ర మంత్రులు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి సీబీఐ డైరెక్టర్‌తో భేటీ అయ్యే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేరళంలో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో పార్టీ పెద్దలనూ రేవంత్ కలిసే అవకాశం ఉంది.