Share News

తెలంగాణలో హామీల అమలుపై వివరించండి

ABN , Publish Date - Apr 04 , 2026 | 05:14 AM

కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రభుత్వం సాధించిన విజయాలను తగ్గిస్తూ.. కించపరిచేలా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ పేర్కొన్నారు.

తెలంగాణలో హామీల అమలుపై వివరించండి

  • కేరళలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి) : కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రభుత్వం సాధించిన విజయాలను తగ్గిస్తూ.. కించపరిచేలా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ పేర్కొన్నారు. తెలంగాణలో రేవంత్‌ ప్రభుత్వం ఏం సాధించిందో ఇక్కడ ఉన్న సీపీఐ, సీపీఎం నాయకులకు వివరిస్తే సరిపోతుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని యువతను మోసం చేశారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు తెలంగాణలో ఎక్కడ అమలు చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. గురువారం కేరళలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ.. తెలంగాణలో ఇచ్చిన ఆరు వాగ్దానాలను సక్రమంగా అమలు చేశామని, అవసరమైతే కేరళ మంత్రివర్గం వచ్చి పరిశీలించవచ్చని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారని గుర్తుచేశారు.

Updated Date - Apr 04 , 2026 | 05:14 AM