Share News

తెలంగాణకు అల్లా దువా ఉండాలి

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:12 AM

ముస్లింలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రంజాన్‌ (ఈద్‌-ఉల్‌-ఫితర్‌) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు..

తెలంగాణకు అల్లా దువా ఉండాలి

  • ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ముస్లింలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రంజాన్‌ (ఈద్‌-ఉల్‌-ఫితర్‌) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు, రాష్ట్ర ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేందుకు అల్లా దువా ఉండాలని ఓ ప్రకటన ద్వారా ఆయన ఆకాంక్షించారు. ముస్లింలంతా తమ కుటుంబసభ్యులు, బంధు మిత్రులతో రంజాన్‌ను ఉత్సాహంగా జరుపుకోవాలని కోరారు. గంగ, జమున, తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని, ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Updated Date - Mar 21 , 2026 | 05:12 AM