సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్ పథకానికి రూ.1056 కోట్లు
ABN , Publish Date - Mar 21 , 2026 | 05:04 AM
రాష్ట్రంలో మాత్రమే కాక.. అంతర్జాతీయ స్థాయిలోనూ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు సర్కారు అడుగులేస్తోంది. ‘సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రాం...
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మాత్రమే కాక.. అంతర్జాతీయ స్థాయిలోనూ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు సర్కారు అడుగులేస్తోంది. ‘సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రాం’ పేరుతో కొత్త పథకం ప్రారంభించడానికి సిద్ధమైంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలని భావించే యువతకు పూర్తి సహకారంతో తగిన శిక్షణనిచ్చి నైపుణ్యాలను మెరుగు పరిచి కెరీర్‌లో నిలదొక్కుకునేలా చేయడమే ఈ పథకం లక్ష్యం. ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) బడ్జెట్‌లో రూ.1,056 కోట్లు ప్రతిపాదించారు. యువతకు వివిధ రంగాల్లో.. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్యం, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్ విభాగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా శిక్షణనిస్తారు.