Share News

మిగులు దొడ్డు బియ్యం అమ్మకంలో స్కాం లేదు

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:39 AM

మిగులు దొడ్డు బియ్యం విక్రయ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని.. సర్కారు విధాన నిర్ణయాల మేరకు, కేబినెట్‌ ఆమోదంతో, ప్రభుత్వ ఈ-మార్కెట్‌ వేదికగా నిర్వహించామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ..

మిగులు దొడ్డు బియ్యం అమ్మకంలో స్కాం లేదు

ఇంటర్నెట్ డెస్క్: మిగులు దొడ్డు బియ్యం విక్రయ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని.. సర్కారు విధాన నిర్ణయాల మేరకు, కేబినెట్‌ ఆమోదంతో, ప్రభుత్వ ఈ-మార్కెట్‌ వేదికగా నిర్వహించామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అయినా దీనిని కుంభకోణంగా చిత్రీకరించడం దురుద్దేశపూరితమని పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్థిదారులకు సన్నబియ్యం సరఫరా చేయాలనే ప్రభుత్వ నిర్ణయం తర్వాత.. సుమారు 1.40 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యం మిగిలిపోయాయని తెలిపింది. వీటిని దీర్ఘకాలం నిల్వ ఉంచితే నాణ్యత క్షీణించడం, గిడ్డంగుల కొరత, అదనపు వ్యయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున విక్రయ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వివరించింది. ఈ ప్రక్రియ మొత్తం ఈ-వేలం ద్వారా బహిరంగ పోటీ పద్థతిలో దేశవ్యాప్తంగా అర్హత కలిగిన బిడ్డర్ల సమక్షంలో జరిగిందని, ఎలాంటి నామినేషన్లు లేదా రహస్య ఒప్పందాలకు తావులేదని సంస్థ పేర్కొంది. రూ.వేల కోట్ల నష్టం జరిగిందనే ప్రచారంలో నిజం లేదని, మొత్తం నిల్వల విలువే సుమారు రూ. 303 కోట్లు ఉంటుందని గణాంకాలతో వివరించింది.

Updated Date - Jun 18 , 2026 | 05:40 AM