Share News

సివిల్స్‌ ఆశావహులకు శుభవార్త

ABN , Publish Date - Jul 12 , 2026 | 06:30 AM

అఖిల భారత సర్వీసెస్‌లో ప్రిలిమినరీ పరీక్ష అర్హత సాధించిన తెలంగాణ అభ్యర్థులకు ‘రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయ హస్తం’ పథకం కింద

సివిల్స్‌ ఆశావహులకు శుభవార్త

  • ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణులైన తెలంగాణ యువతకు రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహకం

  • సింగరేణి సీఎండీ డాక్టర్‌ బుద్ధప్రకాశ్‌ జ్యోతి

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): అఖిల భారత సర్వీసెస్‌లో ప్రిలిమినరీ పరీక్ష అర్హత సాధించిన తెలంగాణ అభ్యర్థులకు ‘రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయ హస్తం’ పథకం కింద లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నట్లు సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్‌ బుద్ధప్రకాశ్‌ జ్యోతి తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈపథకం కింద 2025లో 206 మంది అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహకం అందించగా, వారిలో 50మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారని, చివరకు 20మంది సివిల్‌ సర్వీసె్‌సలో విజయం సాధించారని ఆయన తెలిపారు.

Updated Date - Jul 12 , 2026 | 06:32 AM