Share News

మావోయిస్టు రాజకీయ ఖైదీలను ఆగస్టు 15 సందర్భంగా విడుదల చేయాలి

ABN , Publish Date - Jun 28 , 2026 | 03:24 AM

మావోయిస్టు రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. మావోయిస్టులతో...

మావోయిస్టు రాజకీయ ఖైదీలను ఆగస్టు 15 సందర్భంగా విడుదల చేయాలి

  • తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న నెపంతో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. ‘ఉపా చట్టాన్ని, పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్టును రద్దు చేయాలి’ అన్న డిమాండ్‌తో తెలంగాణ పౌరహక్కుల సంఘం శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కార్యక్రహానికి హాజరైన ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 15 సందర్భంగా ఈ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మావోయిస్టులన్న ఆరోపణలతో హైదరాబాద్‌, ఖమ్మం జైళ్లలో 50 మంది ఖైదు అనుభవిస్తున్నారని, అందులో 35మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆదివాసీలున్నారని తెలిపారు. ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ఖైదీలు ఇతర రాష్ట్రాల జైళ్లలో మగ్గుతున్నారని, వారి విడుదలకు ప్రభుత్వం చొరవచూపాలని కోరారు. రాజకీయ ఖైదీల విడుదల కమిటీ పేరుతో ఒక ఐక్యవేదిక నిర్మించి, ఈ ఖైదీల విడుదల కోసం పోరాడాలని వక్తలంతా తీర్మానించారు.

Updated Date - Jun 28 , 2026 | 03:24 AM