Share News

నేటి నుంచి చికెన్‌ దుకాణాలు బంద్‌

ABN , Publish Date - Apr 01 , 2026 | 04:16 AM

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి దుకాణాలను మూసివేస్తున్నట్లు చికెన్‌ షాపుల యజమానుల సంఘం ప్రకటించింది. చికెన్‌ విక్రయాల్లో తమ మార్జిన్‌ ...

నేటి నుంచి చికెన్‌ దుకాణాలు బంద్‌

  • పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌ను తగ్గించటంపై చికెన్‌ షాపుల యజమానుల నిరసన

  • కిలోకు రూ.30 మార్జిన్‌ ఇవ్వాలని డిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి దుకాణాలను మూసివేస్తున్నట్లు చికెన్‌ షాపుల యజమానుల సంఘం ప్రకటించింది. చికెన్‌ విక్రయాల్లో తమ మార్జిన్‌ (లాభం) పెంచాలన్న డిమాండ్‌ను పౌల్ట్రీ కంపెనీలు పట్టించుకోనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా పౌలీ్ట్ర యజమానులు రిటైల్‌ దుకాణాలకు కిలో మీద రూ.26 మార్జిన్‌ ఇస్తున్నారని, దానిని పెంచకపోగా ఇటీవల ఏకంగా రూ.16కి తగ్గించారని పేర్కొన్నారు. ఇది తమను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే నిర్ణయమన్నారు. మార్జిన్‌ను కిలోకు రూ.30కి పెంచాలని, అప్పటి వరకు దుకాణాలు తెరిచేది లేదని స్పష్టం చేశారు. కాగా, బుధవారం నుంచి షాపులు మూసేస్తుండటంతో హోటళ్లలో కూడా చికెన్‌ బిర్యానీలు, చికెన్‌ వంటకాలకు బ్రేక్‌ పడనుంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కమర్షియల్‌ గ్యాస్‌ కొరతతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న తమకు.. చికెన్‌ దుకాణాల బంద్‌తో నష్టాలు మరింత పెరుగుతాయని హోటళ్ల యజమానులు వాపోతున్నారు.

Updated Date - Apr 01 , 2026 | 04:16 AM