Share News

రాష్ట్రంలో బీజేపీతోనే మార్పు

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:03 AM

తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీతోనే సాధ్యం అవుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గ్రామాలతోపాటు పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పేర్కొన్నారు.

రాష్ట్రంలో బీజేపీతోనే మార్పు

  • రాష్ట్రానికి కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

చేవెళ్ల, పిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీతోనే సాధ్యం అవుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గ్రామాలతోపాటు పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు ప్రజలకు శాపాలుగా మారాయని వాఖ్యానించారు. మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌ షోలో ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, సీఎం రేవంత్‌రెడ్డి మాటలతో ప్రజలను నమ్మించి కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు కాంగ్రెస్‌ చేసిందేమీ లేదన్నారు. బీఆర్‌ఎ్‌సకు పదేళ్లు అధికారం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిందని ఆరోపించారు. తెలంగాణ సంపదను బీఆర్‌ఎస్‌ దోచుకుందని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ ఎన్నికల తరహలోనే మునిసిల్‌ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

Updated Date - Feb 09 , 2026 | 02:03 AM