Share News

డీట్‌ ద్వారా ప్రైవేటు రంగంలో ఉపాధి

ABN , Publish Date - Mar 19 , 2026 | 04:26 AM

రాష్ట్రంలో ప్రైవేట్‌ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఏర్పాటుచేసిన డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ ఇండియా (డీట్‌) సేవలను నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని .....

డీట్‌ ద్వారా ప్రైవేటు రంగంలో ఉపాధి

  • నిరుద్యోగులంతా ఈ సేవలు వినియోగించుకోవాలి

  • ఉన్నత విద్యామండలి చైర్మన్‌ వి.బాలకిష్టారెడ్డి సూచన

హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేట్‌ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఏర్పాటుచేసిన డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ ఇండియా (డీట్‌) సేవలను నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి కోరారు. డీట్‌లో నిరక్షరాస్యుల నుంచి పీహెచ్‌డీ విద్యావంతుల వరకు పేర్లు నమోదు చేసుకుంటే ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. డీట్‌లో 2 వేలకు పైగా కంపెనీలు నమోదయ్యాయని, రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కాలేజీల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులంతా ఇందులో (www.deet.telangana.go-v.in) పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కేంద్రప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మూడో విడత ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకంలో పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, బీఎడ్‌, ఇతర వృత్తి విద్యాకోర్సులు చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు (pminternship.mca.gov.in)లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంటర్న్‌షి్‌పకు ఎంపికైన విద్యార్థులకు 6 నుంచి 9 నెలల వరకు నెలకు రూ.9 వేల భత్యం ఇస్తారని తెలిపారు.

Updated Date - Mar 19 , 2026 | 04:26 AM