Share News

త్వరలో ‘సర్‌’ ప్రక్రియ

ABN , Publish Date - May 12 , 2026 | 04:16 AM

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) త్వరలో ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణను (సర్‌ను) ప్రకటించనుందని, ఈ నేపథ్యంలో ప్రక్రియను ప్రారంభించేందుకు మ్యాపింగ్‌ను పూర్తి చేయాలని...

త్వరలో ‘సర్‌’ ప్రక్రియ

  • ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయండి

  • జిల్లా కలెక్టర్లతో సీఈవో సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) త్వరలో ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణను (సర్‌ను) ప్రకటించనుందని, ఈ నేపథ్యంలో ప్రక్రియను ప్రారంభించేందుకు మ్యాపింగ్‌ను పూర్తి చేయాలని సీఈఓ సుదర్శన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల విభాగాలతో సోమవారం తన కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్‌ ప్రారంభానికి ముందే రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఈ నెలాఖరుకు 90 శాతం పురోగతి సాధించాలని ఆదేశించారు. ఓటర్లకు మ్యాపింగ్‌ కోసం సహాయం చేయడానికి ‘హెల్ప్‌ డెస్క్‌’లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాల్లోని ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా ద్వారా ఈ ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్లకు సీఈఓ సుదర్శన్‌రెడ్డి సూచించారు.

Updated Date - May 12 , 2026 | 04:16 AM