Share News

‘సర్‌’లో సాంకేతికతను వాడండి: సీఈవో

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:54 AM

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌-సర్‌) ప్రక్రియలో సమాచార సాంకేతికత (ఐటీ)ను విరివిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికా...

‘సర్‌’లో సాంకేతికతను వాడండి: సీఈవో

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌-సర్‌) ప్రక్రియలో సమాచార సాంకేతికత (ఐటీ)ను విరివిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సర్‌ ప్రక్రియలో ఐటీ వినియోగంపై జిల్లా, మండల స్థాయి మాస్టర్‌ ట్రైనర్లు, ఐటీ సపోర్ట్‌ బృందాలు, డేటా ఆపరేటర్లకు బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. ఓటరు జాబితా రూపకల్పనలో ఐటీ అంశం అత్యంత కీలకమని, దాని వినియోగంతో ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు పారదర్శకత కూడా పెరుగుతుందన్నారు. ఓటర్లు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమో దు చేసుకునేందుకు అందుబాటులో ఉన్న ఠి్ట్ఛౌట.్ఛఛిజీ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - Jun 11 , 2026 | 04:54 AM