Share News

త్వరలోనే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ: సీఈవో

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:54 AM

తెలంగాణలో త్వరలోనే ఓటరు జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి...

త్వరలోనే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ: సీఈవో

హైదరాబాద్‌, పిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో త్వరలోనే ఓటరు జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను రాష్ట్రంలోని ఎన్నికల విభాగాలు ఎటువంటి లోపాలు తలెత్తకుండా అత్యంత పారదర్శకగా రూపొందించాలని ఆదేశించారు. గురువారం సీఈవో కార్యాలయంలో సుమారు 50 మంది ఎన్నికల నమోదు అధికారులకు (ఈఆర్‌వో) ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఓటరు జాబితాల ప్రక్షాళన, సవరణ ప్రక్రియను మరింత పటిష్ఠం చేసే దిశగా ఎన్నికల సంఘం కీలక అడుగు వేసిందని పేర్కొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 12:54 AM