రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ వేడుకలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:42 AM
రాష్ట్రంలో రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) వేడుకలు ఘనంగా జరిగాయి. నెలరోజుల పాటు ఉపవాస దీక్షల అనంతరం శనివారం రంజాన్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు.
హైదరాబాద్ సిటీ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) వేడుకలు ఘనంగా జరిగాయి. నెలరోజుల పాటు ఉపవాస దీక్షల అనంతరం శనివారం రంజాన్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ఈద్గాలు, మసీదుల వద్ద రంజాన్ శోభ సంతరించుకుంది. పాత నగరంలోని మీరాలం ఈద్గా, మాదన్నపేట్, మక్కా మసీదుతో పాటు ప్రధాన ఈద్గాలు, మసీదుల వద్ద ముస్లింలు భారీ సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనాలతో ఈద్ ముబారక్‌లు తెలుపుకొన్నారు. వేడుకల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నగర పోలీసులు అన్ని ప్రార్థనా మందిరాల వద్ద సుమారు 11 వేల మంది సిబ్బందితో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.