Share News

అత్యంత వెనుకబడిన వర్గం డక్కల

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:39 AM

వెనుకబాటుతనం ప్రకారం రాష్ట్రంలో ఏయే కులాలు ఏ స్థానంలో ఉన్నాయన్న వివరాలను సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ మేరకు కాంపోజిట్‌ బ్యాక్‌వర్డ్‌ ఇండెక్స్‌...

అత్యంత వెనుకబడిన వర్గం డక్కల

  • 116 పాయింట్లలో కనిష్ఠ స్థానంలో .. పలు ఇతర ఎస్సీ కులాలు కూడా వెనుకబాటుతనంలోనే..

  • ఆ పరిస్థితుల్లోనే బీసీ-ఏ, బీసీ-ఈ కులాలు

  • అతి తక్కువ వెనుకబాటుతనంలో ఓసీ కులాలు

  • పాయింట్ల వారీగా కులాల జాబితాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): వెనుకబాటుతనం ప్రకారం రాష్ట్రంలో ఏయే కులాలు ఏ స్థానంలో ఉన్నాయన్న వివరాలను సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ మేరకు కాంపోజిట్‌ బ్యాక్‌వర్డ్‌ ఇండెక్స్‌ (సీబీఐ) సూచికను తయారు చేశారు. దీని ప్రకారం వెనుకబాటుతనం ఆధారంగా ఆయా కులాలకు పాయింట్లు కేటాయించారు. 116 పాయింట్లతో అత్యంత వెనుకబడిన వర్గంగా డక్కల కులం (ఎస్సీ) నమోదైంది. 12 పాయింట్లతో కాపు కులం (ఓసీ) అత్యంత తక్కువ వెనుకబడిన వర్గంగా నిలిచింది.

100 నుంచి 116 పాయింట్ల వరకు ఉన్న కులాలు

బీసీ-ఈ (అంచుకట్టలవాండ్లు), బీసీ-ఏ రాజన్నాల, ఎస్సీ-బైండ్ల, ఎస్సీ-మాదిగలు 100 పాయింట్లతో ఉన్నాయి. బీసీ-ఏ (ఓడ్‌), ఎస్టీ-సర్వార్లు, ఎస్సీ- మాల హన్నాయ్‌, ఎస్సీ-గోసగాని, బీసీ-ఏ (మెహతార్‌ముస్లిం)లు 101 పాయింట్లతో ఉన్నాయి. ఎస్సీ-మాంగ్‌ (గరోడీ), బీసీ-ఏ (గోట్రాల), ఎస్సీ-మాంగ్‌ 102 పాయింట్లతో, బీసీ-ఏ (బెయిల్‌), ఎస్టీ-తోటి, బీసీ-ఈ (గరాడీ), ఎస్సీ-మాదాసిలు 103 పాయింట్లతో ఉన్నాయి. తర్వాత క్రమంలో ఎస్టీ (ఎరుకల), బీసీ-ఈ గోసగాని, బీసీ-ఏ (మందుల), బీసీ-ఈ (ఖరేషీ ముస్లిం), ఎస్సీ-మాతంగి, బీసీ-ఏ (ఒడ్డే), ఎస్సీ (హోలియా దాసరి), బీసీ-ఏ (తోలుబొమ్మలాటవారు), ఎస్టీ-కమ్మర, ఎస్సీ-హోలియా, ఎస్సీ- జగ్గాలి, బీసీ-ఏ (జోషినందివాలాలు), ఎస్సీ-బ్యాగర, ఎస్టీ-చెంచు, బీసీ-ఈ (ఫకీర్‌ ముస్లిం), ఎస్సీ-మష్తి, బీసీ-ఈ (పకీర్ల), బీసీ-ఏ (పిచ్చగుంట్ల), బీసీ-ఈ (తుర్కముస్లిం), ఎస్సీ-సిందోళ్లు, ఎస్టీ-నక్కల, ఎస్సీ-బేడ, ఎస్సీ- డక్కల వర్గాలు ఉన్నాయి.

90-99 పాయింట్లతో ఉన్న కులాలు

ఎస్సీ- మాలజంగం, ఎస్టీ-పర్దాన్‌, బీసీ-ఏ (బుడబుక్కల), బీసీ-ఏ (బాగోతుల), బీసీ-ఈ (లబ్బి), ఎస్సీ- మాలమస్తి, బీసీ-ఏ (మొండివారు), బీసీ-బి (కురుభ కురుమ), బీసీ-బి (దూదేకుల), ఎస్సీ-చందాల, బీసీ-ఏ (గంజికుంటి), ఎస్సీ- ఎల్లమ్మలవార్‌, ఎస్సీ- జాంబవులు, బీసీ-డి (కుర్మి), ఎస్టీ-కోలాం, ఎస్సీ-మాలసేల్‌, బీసీ-డి (యాదవ), ఎస్టీ-కోయ, బీసీ-బి (ఆరె మరాత్‌), బీసీ-ఏ (అగ్రికులక్షత్రియ), బీసీ-డి (ఉప్పర), బీసీ-డి (హట్కార్‌), బీసీ-ఏ (వీరముష్టి), బీసీ-ఏ (పూసల), ఎస్సీ- మాలదాసరి, బీసీ-ఈ (షేక్‌ ముస్లిం), బీసీ-డి (ఆరెవాళ్లు), ఎస్టీ-ముఖ, ఎస్సీ-చచాటి, ఎస్టీ- యానాది, ఎస్టీ-గోండ్‌, బీసీ-ఏ (నాయి బ్రాహ్మణ), బీసీ-డి (ముదిరాజ్‌), బీసీ-ఏ (పాతంవారు), బీసీ-ఏ (కాకిపడగల), ఎస్టీ- కొందా, బీసీ-ఏ (పాల-ఏకరి), బీసీ-ఏ (సన్నాయిల), ఎస్సీ (చలవాది), ఎస్టీ- ఆంద్‌, ఎస్టీ-లంబాడీ, బీసీ-ఏ (రజక), ఎస్టీ-పోర్జా, ఎస్టీ-కొటియా, ఎస్సీ- దోర్‌, బీసీ-ఈ (అట్టార్‌), బీసీ- ఈ (దోబి ముస్లిం), ఎస్సీ- బావురి, ఎస్టీ-మన్న, బీసీ-ఏ (సికిలిగార్‌), ఎస్సీ-డోమ్‌, ఎస్టీ-నాయక్స్‌, ఎస్సీ- మాదిగదాసు, బీసీ-డి (మాతుర), బీసీ-డి (మాలి), బీసీ-ఏ (వాల్మీకి), ఎస్సీ-మహర్‌.


60-89 పాయింట్లతో ఉన్న కులాలు

బీసీ-ఏ (యాత), బీసీ-డి (గోవిలి), బీసీ-డి (కచి), బీసీ-ఏ (పంబాల), బీసీ-బి (స్వకులశాలి), బీసీ-బి (కర్ణభక్తులు), బీసీ-ఏ (గుడాల), బీసీ-ఏ (కైకది), ఎస్సీ- రెల్లి, ఎస్సీ-చంబార్‌, బీసీ-బి (పెరిక), బీసీ-డి (వీరశైవ), ఎస్సీ- సప్రు, బీసీ-డి (బొందిలి), బీసీ-డి (మున్నురుకాపు), ఎస్సీ-పంచమ, బీసీ-బి (పద్మశాలి), ఓసీ- ముస్లిం, బీసీ-డి (చిప్పొలు మేర), ఎస్టీ- బాగట, బీసీ-డి (వంజర), ఎస్టీ-హిల్‌, బీసీ-ఏ (బుక్క), బీసీ-బి (జండ్ర), ఎస్సీ-అర్వమాల, బీసీ-ఏ (దొమ్మెర), ఎస్టీ- (కొండరెడ్డి), ఎస్సీ- ఆది ఆంధ్ర, బీసీ-ఏ (జంగం), బీసీ-బి (గండ్ల), ఎస్సీ-యాతాల, ఎస్టీ-జాట్పుస్‌, బీసీ-బి (నీలకాంతి), బీసీ-బి (బ్రాస్‌మిత్‌), బీసీ-ఏ (జోగి), ఎస్సీ- ఆది ద్రావిడ, బీసీ-ఏ (అడ్డపువారు), బీసీ-బి (నెస్సి), బీసీ-బి (ఆర్యక్షత్రియ), బీసీ-ఏ (కంజర), బీసీ-డి (తమ్మాలి), బీసీ-ఈ (సిద్ధి), ఎస్సీ-మెహతార్‌, ఎస్టీ-కట్టున్‌కాయన్‌, బీసీ-ఈ (హజమ్‌), ఎస్సీ- బైరికి, బీసీ-ఏ (కెంపరె), బీసీ-ఏ (దాసరి), బీసీ-బి (గౌడ్‌), ఎస్సీ-గాసి, ఎస్సీ-దండాసి, బీసీ-డి (పస్సి), బీసీ-ఏ (పెద్దమ్మవాండ్లు), బీసీ-బి (బుడుబుంజాల బూన్‌జవా), ఎస్సీ-మిత, ఎస్టీ-గౌడు, బీసీ-డి (లక్కమారికాపు), బీసీ-ఏ (తేరచీరాల), బీసీ-డి (కోష్టి), బీసీ-డి (కృష్ణబలిజ), ఎస్టీ-బిల్‌, ఎస్సీ-గోడారి, బీసీ-ఏ (పరికి), బీసీ-డి (జింగార్‌), బీసీ-ఏ (పాట్రా), ఎస్టీ-గడబాస్‌, ఎస్సీ-అనామక్‌, బీసీ-ఏ (కాటిపాపల), బీసీ-డి (కుళ్లకడగి), బీసీ-ఏ (ఎనూటి), బీసీ-ఏ (గౌడ), ఎస్టీ- కొండకాపు, ఎస్టీ- కొండదొర, బీసీ-డి (ఆరెకటిక), ఎస్టీ-రెడ్డి, ఎస్టీ-కులియ, బీసీ-ఏ (మొండెపట్ట), ఎస్సీ-మాలదాసు, బీసీ-ఏ (కసికపడి), ఎస్సీ-ముందాల, ఎస్టీ-రోన, బీసీ-ఏ (సిద్దుల), ఎస్సీ-కొలుపులవాండ్లు, బీసీ-బి (వడ్రంగి), బీసీ-ఈ (గుడ్డి), బీసీ-ఏ (మేదరి), ఎస్సీ-మాలసన్యాసి, బీసీ-ఏ (చోపెమరి), ఎస్సీ-మన్నె, బీసీ-ఏ (కునపులి), ఎస్సీ-చమర్‌, బీసీ-ఏ (గంగిరెడ్లవారు), బీసీ-బి (కమ్మరి), ఎస్సీ-పమిడి, ఎస్సీ-ఆర్యమాల, బీసీ-బి (కుమ్మర), ఎస్సీ-మాల, బీసీ-బి (కాసి), బీసీ-ఏ (పార్ది), బీసీ-బి (లోద్‌).

12 నుంచి 59 పాయింట్లతో ఉన్న కులాలు

ఓసీల్లోని కాపు, జైనులు, రాజు, వెలమ, కమ్మ, అయ్యంగార్లు, బ్రాహ్మణ, వర్మ, పట్నాయక్‌, వైశ్య, కరణం, రెడ్డి, లింగాయత్‌, ఓసీ క్రిస్టియన్స్‌ (నాన్‌ బీసీ-సీ), బీసీ-ఏ (పాముల), బీసీ-డి (సోంది), ఓసీ-సిక్కు, బీసీ-డి (ఆగముదియన్‌), ఎస్సీ-అరుంధతీయ, బీసీ-డి (నగరాలు), బీసీ-ఏ (బాలసంతు), బీసీ-ఏ (శ్రీ), బీసీ-డి (సాతాని), బీసీ-డి (శిష్టకరణం), ఓసీ-బుద్ధిస్ట్‌, బీసీ-డి (రంగరేజ్‌), బీసీ-బీ (పట్కార్‌), ఓసీ-మార్వాడీలు, బీసీ-సీ (ఎస్సీ క్రిస్టియన్లు), ఎస్సీ-పాకి, బీసీ-డి (సుర్య), బీసీ-డి (కంసాలి), బీసీ-డి (భట్రాజు), బీసీ-బి (తొగట), బీసీ-బి (నీలి), ఎస్సీ- సమగర, బీసీ-ఏ (నొక్కార్‌), బీసీ-డి (అహీర్‌), బీసీ-డి (సరోళ్లు), ఎస్సీ-వళ్లువన్‌, బీసీ-బి (దేవంగ), బీసీ-డి (అయ్యారక), బీసీ-బి (కరికళాభక్తులు), ఎస్సీ-సంభాన్‌, బీసీ-డి (సాధుచెట్టి), బీసీ-డి (వరాల).

Updated Date - Apr 16 , 2026 | 04:39 AM