ప్రాధాన్యాలను బట్టి కేటాయింపులు
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:43 AM
ప్రభుత్వ ప్రాధాన్యత దృష్ట్యా శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు చేశామని శుక్రవారం కేబినెట్ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
శాఖల వారీగా ఉన్నతాధికారులతో సమీక్షించండి
అవసరమైతే సర్దుబాటు చేస్తా
రాబడి పెంచుకోవడంపై దృష్టిపెట్టండి: కేబినెట్ భేటీలో సీఎం
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రాధాన్యత దృష్ట్యా శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు చేశామని శుక్రవారం కేబినెట్ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బడ్జెట్ కేటాయింపులపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించుకుని, అవసరాలపై అవగాహనకు రావాలని మంత్రులకు సూచించారు. ఇంకా బడ్జెట్ అవసరం అనుకుంటే సర్దుబాటు చేస్తానని చెప్పారు. తనను కలిసిన మంత్రికి ఎక్కువ బడ్జెట్ ఇచ్చానని, కలవని మంత్రికి తక్కువ బడ్జెట్ ఇచ్చానని అనుకోవద్దని స్పష్టం చేశారు. రెండేళ్లు బాగా పనిచేశామని, మిగతా రెండున్నరేళ్లు మరింత సమర్థవంతంగా పనిచేద్దామని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఆయా శాఖల్లో రాబడి పెంచుకోవడంపై దృష్టిపెట్టాలని మంత్రులకు సూచించారు.