రేపు క్యాబినెట్ భేటీ
ABN , Publish Date - May 03 , 2026 | 05:16 AM
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 4న జరగనుంది. సచివాలయంలోని ఆరో అంతస్తులో క్యాబినెట్ మీటింగ్ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 4న జరగనుంది. సచివాలయంలోని ఆరో అంతస్తులో క్యాబినెట్ మీటింగ్ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ దృష్ట్యా అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు తగిన సమాచారంతో అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆదేశించారు. సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు, ఆరోగ్య పథకం, బిల్లుల చెల్లింపు వంటి సమస్యలపై చర్చించే అవకాశముంది. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై సమావేశంలో చర్చించి, స్పష్టతనిస్తారని సమాచారం. గోదావరి పుష్కరాలు, జనగణన వంటి అంశాలూ చర్చకు వచ్చే అవకాశముంది.