టారిఫ్ సబ్సిడీ 14 వేల కోట్లు
ABN , Publish Date - Mar 21 , 2026 | 05:14 AM
వ్యవసాయ పంపుసెట్లతోపాటు పలు వర్గాలకు రాయితీ కింద విద్యుత్ అందిస్తున్న విద్యుత్ సంస్థలకు బడ్జెట్‌లో రూ.14వేల కోట్లను కేటాయించారు.
మొత్తంగా విద్యుత్ సంస్థలకు 21,285 కోట్లు
వ్యవసాయ పంపుసెట్లతోపాటు పలు వర్గాలకు రాయితీ కింద విద్యుత్ అందిస్తున్న విద్యుత్ సంస్థలకు బడ్జెట్‌లో రూ.14వేల కోట్లను కేటాయించారు. మొత్తంగా విద్యుత్ రంగానికి రూ.21,285 కోట్లను ప్రతిపాదించారు. గృహజ్యోతికి రూ.2,080కోట్లు, ట్రాన్స్‌కోకు రూ.1000కోట్లు, జెన్‌కోకు రూ.1000కోట్లు, హరిత ఇంధనం ప్రమోషన్ కోసం రూ.1,000కోట్లు, సౌర గ్రామాల కోసం రూ.1000కోట్లు, ఇందిర సౌర గిరి జల వికాసానికి రూ.600కోట్లు కేటాయించారు.