Share News

రూ.103 కోట్లతో రెండు బ్రిడ్జిల నిర్మాణం: కేంద్రం

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:17 AM

తెలంగాణలోని రెండు రైల్వే పనులకు సంబంధించి కేంద్రం శుభవార్త చెప్పింది. ‘సేతుబంధన్‌’ పథకంలో భాగంగా సెంట్రల్‌ రోడ్‌ ...

రూ.103 కోట్లతో రెండు బ్రిడ్జిల నిర్మాణం: కేంద్రం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని రెండు రైల్వే పనులకు సంబంధించి కేంద్రం శుభవార్త చెప్పింది. ‘సేతుబంధన్‌’ పథకంలో భాగంగా సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (సీఆర్‌ఐఎఫ్‌) కింద రూ.103 కోట్ల పనులకు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్‌) ఆమోదం తెలిపింది. ఈ మేరకు నల్గొండ జిల్లా పరిధిలో నార్కట్‌పల్లి-మునుగోడు రైల్వే లైన్‌లోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జికి రూ.69కోట్లు, ఖమ్మం జిల్లా మధిరలోని రైల్వే లైన్‌ దగ్గర అండర్‌పాస్‌, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జితోపాటు అప్రోచ్‌ రోడ్ల అభివృద్ధికి రూ.34 కోట్లు ఖర్చుపెట్టనుది.

Updated Date - Apr 08 , 2026 | 05:17 AM