Share News

అంతర్జాతీయ సహకారంతో సాగుకు కొత్త దిశ

ABN , Publish Date - Apr 03 , 2026 | 04:53 AM

వ్యవసాయ రంగాన్ని సాంకేతికంగా బలోపేతం చేయడం ద్వారా.. రైతుల ఆదాయాన్నిపెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.

అంతర్జాతీయ సహకారంతో సాగుకు కొత్త దిశ

  • ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు ప్రోత్సాహం: తుమ్మల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగాన్ని సాంకేతికంగా బలోపేతం చేయడం ద్వారా.. రైతుల ఆదాయాన్నిపెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన సహజ వనరులు, పర్యావరణ పాఠశాల ప్రతినిధుల బృందం సమావేశమై చర్చించింది. ఈ బృందానికి ఆ యూనివర్సిటీ డైరెక్టర్‌ డా. కె. రమేష్‌ రెడ్డి నేతృత్వం వహించారు. శ్రీకొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం(ఎ్‌సకేఎల్‌టీజీహెచ్‌యూ)తో కలిసి పరిశోధన, విస్తరణ, విద్యారంగాల్లో సంయుక్త భాగస్వామ్యం ఏర్పాటుకు ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌కేఎల్‌టీజీహెచ్‌యూ, ఫ్లోరిడా విశ్వవిద్యాలయం కలిసి ‘‘తెలంగాణ డిజిటల్‌ సుస్థిర వ్యవసాయ వ్యవస్థల కేంద్రం’’ స్థాపించాలన్న అంశపైనా చర్చించారు. ఈ భాగస్వామ్యంతో డిజిటల్‌ సాగు, కచ్చిత వ్యవసాయం, ఏఐ ఆధారిత విధానాలు, రిమోట్‌ సెన్సింగ్‌, డ్రోన్‌ టెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులను ఈ రంగంలో ప్రవేశపెట్టే అవకాశముంది. అంతర్జాతీయ భాగస్వామ్యాలు రాష్ట్ర వ్యవసాయ రంగానికి కొత్త ఊపును తెస్తాయని తెలిపారు.

Updated Date - Apr 03 , 2026 | 04:53 AM