Share News

తడిసిన ధాన్యం కొంటాం!

ABN , Publish Date - May 07 , 2026 | 05:24 AM

అకాల వర్షాలతో ధాన్యం తడిస్తే.. దానిని కూడా కనీస మద్ద తు ధరకు కొనుగోలుచేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌరసరఫరా ల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించారు.

తడిసిన ధాన్యం కొంటాం!

  • ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలుకు 21 వేల కోట్లు: ఉత్తమ్‌

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలతో ధాన్యం తడిస్తే.. దానిని కూడా కనీస మద్ద తు ధరకు కొనుగోలుచేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌరసరఫరా ల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఎక్కడ ధాన్యం తడిసినా వెంటనే సమీపంలోని రైస్‌ మిల్లులకు చేర్చేలా ఏర్పా ట్లు చేసినట్లు తెలిపారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ యాసంగిలో రైతుల నుంచి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు ధాన్యం కొనుగోలు చేసేందుకు రూ.21 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తూకం సమయంలో తాలు, తరుగు పేరుతో ఒక్క కిలో కోతపెట్టినా.. కొనుగోలు కేంద్రాలు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో బస్తాకు నాలుగైదు కిలోలు తరుగు తీసేవారని, ఇప్పుడు అలా చేసేదిలేదని స్పష్టంచేశారు. ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైందని తెలిపారు. 141 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని, ఇందులో 90 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని ప్రభు త్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. ఇప్పటివరకు 17.28 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారంతో రైతులను అయోమయానికి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కొనుగోలు కేంద్రాల్లో సకల సౌకర్యాలు..

ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 8,575కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు. 2.63లక్షల టార్పాలిన్లు, 18.50 కోట్ల గోనెసంచులు, ధాన్యం రవాణాకు 6,200 ట్రక్కులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులకు తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, నీడ కోసం టెంట్లు కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అకాల వర్షాలు, వడగళ్లు, పిడుగులు కూడా పడుతున్న నేపథ్యంలో రైతు లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు జాగ్రత్తగా ఉం డాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతు లు ప్రమాదవశాత్తు చనిపోతే వెంటనే పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలకు రాష్ట్రస్థాయి అధికారులను నోడల్‌ అధికారులగా నియమించి, పౌరసరఫరాల భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ధాన్యం విక్ర యం కోసం రైతులు ఎదురుచూడకుండా టోకెన్‌ పద్ధతిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ హ యాంలో 2023-24లోవానాకాలంలో రూ.10,417 కోట్లు, యాసంగిలో రూ.10,549 కోట్లు ఎమ్మెస్పీ కింద రైతులకు చెల్లిస్తే.. తాము 2024-25 వానాకాలంలో రూ.12,504 కోట్లు, యాసంగిలో రూ.17,198 కోట్లు చెల్లించినట్లు వివరించారు. చివరి గింజ కొనేవరకు కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంచుతామన్నారు.

Updated Date - May 07 , 2026 | 05:24 AM