Share News

ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానం

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:46 AM

విద్యాశాఖలో ప్రత్యేకత చాటిన ఐదుగురు ప్రధానోపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లను అందించింది.

ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానం

హైదరాబాద్‌, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): విద్యాశాఖలో ప్రత్యేకత చాటిన ఐదుగురు ప్రధానోపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లను అందించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి వారికి ఈ పురస్కారాలు అందించారు. వీరిలో కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ కె.విజయ్‌ కుమార్‌, సిద్దిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఏ.గోవర్ధన్‌, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ కౌసర్‌ జహాన్‌, హన్మకొండ జిల్లా గట్ల నరసింగాపూర్‌ మండల ప్రజాపరిషత్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిమ్మ వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా మణికొండ జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.నిరంజన్‌ ఉన్నారు. తెలంగాణ భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే కీలక బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని.. ఉత్తమ ఉపాధ్యాయులను గౌరవించడం తనకు గర్వంగా ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jun 03 , 2026 | 05:46 AM