బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:40 AM
తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది.
20 నుంచి మే 10 వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు శనివారం ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 30 డిగ్రీ కళాశాలల్లో 9,260 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరుగుతుందని, మే 10వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు నిర్ణయించినట్లు తెలిపారు. సందేహాల నివృత్తి కోసం 040-23328266 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.