Share News

గురుకులాల్లో బ్యాక్‌లాగ్‌ సీట్ల రెండో జాబితా..

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:26 AM

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీలో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్‌ ప్రవేశాల రెండో విడత ఎంపిక జాబితా విడుదలైంది.

గురుకులాల్లో బ్యాక్‌లాగ్‌ సీట్ల రెండో జాబితా..

హైదరాబాద్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీలో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్‌ ప్రవేశాల రెండో విడత ఎంపిక జాబితా విడుదలైంది. ఫలితాలను సొసైటీ అధికారిక వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చని సొసైటీ ఇన్‌ఛార్జ్‌ కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. ప్రవేశ పరీక్ష మెరిట్‌ ఆధారంగా ఎంపికైన విద్యార్థులకు అధికారులు ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తారని, వీరంతా తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో సిద్థంగా ఉండాలని సూచించారు. వీరికి ఈ నెల 5వ తేదీ నుంచి సీట్ల కేటాయింపు, భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సర కోర్సులకు సంబంధించి మొదటి విడత(ఫస్ట్‌ లిస్ట్‌)లో సీట్లు పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో రిపోర్ట్‌ చేయడానికి గురువారం చివరి రోజని మల్లయ్య భట్టు తెలిపారు.

Updated Date - Jun 04 , 2026 | 06:26 AM