Share News

కన్నవారికి చట్ట కవచం

ABN , Publish Date - Mar 30 , 2026 | 05:34 AM

ఒకాయన ప్రజాప్రతినిధిగా చాలా పైకి ఎదిగిండు. ఆయన తండ్రికి క్యాన్సర్‌ వస్తే.. అప్పుడు ఆయన మంత్రిగా ఉండి.. తండ్రిని కనీసం పట్టించుకోలే.

కన్నవారికి చట్ట కవచం

  • తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

  • వృద్ధ తల్లిదండ్రుల సమస్యలపై సీఎం భావోద్వేగ ప్రసంగం

  • శ్రవణకుమారుడు, రేమండ్‌ సింఘానియా విషాద గాథల ప్రస్తావన

  • తల్లిదండ్రుల పట్ల భక్తి లేనివారికి భయం కలిగించేందుకే ఈ చట్టం

  • కన్నవారిని నిర్లక్ష్యం చేసే కొడుకులను బహిష్కరించాలి: సీఎం

  • ఫిర్యాదులపై చర్యలకు చట్టపరిధిలో ప్రత్యేక యంత్రాంగం

  • వృద్ధుల గౌరవ జీవనానికి ఈ చట్టం ఒక మార్గం: మంత్రి అడ్లూరి

  • క్రీడల్లో రాణించినా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా: రేవంత్‌

  • మీ కొడుకు మంత్రే కదా..

ఒకాయన ప్రజాప్రతినిధిగా చాలా పైకి ఎదిగిండు. ఆయన తండ్రికి క్యాన్సర్‌ వస్తే.. అప్పుడు ఆయన మంత్రిగా ఉండి.. తండ్రిని కనీసం పట్టించుకోలే. తండ్రిని బజారుకు తీసుకెళ్లి పండ్లు కూడా కొనివ్వలేని పరిస్థితి ఆయనది. ఇంట్లో తిండి పెట్టీ పెట్టక.. భార్య భయానికి తండ్రి యోగక్షేమాలు కూడా తెలుసుకోలేని పరిస్థితి. పాపం ఆ పెద్దాయన నడుచుకుంటూ వెళ్లి పళ్లు ఫలాలు తెచ్చుకొని ఆయన జీవితం ఆయనే గడిపిండు. ఒకరోజు ఆయన రోడ్డుపక్కనుంచి నడుచుకుంటూ వెళ్తుంటే.. నేను పలకరించిన.. ‘మీ కొడుకు మంత్రే కదా నీకెందుకీ తిప్పలు?’ అని అడిగిన.. అందుకు ఆయన.. ‘వాడిని కష్టపెట్టడం ఎందుకులే అని నేనే తెచ్చుకుంటున్నా నాయనా’ అన్నాడు. ఇటీవల ఆ పెద్దమనిషి చనిపోతే.. మన నాయకులంతా వెళ్లి ఆ మాజీ మంత్రిని పరామర్శించి వచ్చారు. కానీ, ఆయన తండ్రి పట్ల ప్రవర్తించిన తీరు చాలామందికి తెలియదు. గొప్పగొప్ప పదవుల్లో ఉండి తల్లిదండ్రులను పట్టించుకోని ప్రజాప్రతినిధులు సమాజంలో చాలామంది ఉన్నారు. అందుకే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులనేకాకుండా.. ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చాం.

- శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

Updated Date - Mar 30 , 2026 | 05:34 AM