Minister Seethakka: ఎంఎన్‌ఆర్‌ఈజీఎ్‌సను కొనసాగిద్దాం
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:49 AM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్‌ఆర్‌ఈజీఎ్‌స)ను యథావిధిగా కొనసాగించాలని ప్రతిపాదిస్తూ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన...
మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన తీర్మానానికి మండలి ఆమోదం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్‌ఆర్‌ఈజీఎ్‌స)ను యథావిధిగా కొనసాగించాలని ప్రతిపాదిస్తూ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. శనివారం భోజన విరామం అనంతరం సమావేశమైన మండలిలో కేంద్రం ప్రవేశపెట్టిన వీబీజీరామ్‌జీ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టి మంత్రి సీతక్క చర్చ ప్రారంభించారు. కేంద్ర చట్టం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు వలస బాట పట్టే ముప్పు ఉందన్నారు. ఎమ్మెల్సీలు మహే్‌షకుమార్‌గౌడ్, తీన్మార్ మల్లన్న, సీపీఐ సభ్యులు నెల్లికంటి సత్యం, శంకర్‌నాయక్ తదితరులు కేంద్ర చట్టాన్ని వ్యతిరేకించారు.