Share News

పోలీసు కొలువుల జాతర

ABN , Publish Date - Jul 04 , 2026 | 05:54 AM

తెలంగాణ పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 5 వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

పోలీసు కొలువుల జాతర

  • 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ఆమోదం

  • 200 ఎస్సై పోస్టులు, 3,697 సివిల్‌, 1,052 ఆర్మ్డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుళ్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, జూలై 3( ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 5 వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు శాఖలో ఖాళీల పరిస్థితి, శాఖ అవసరాలు, ఆర్థిక భారం తదితర అంశాలను పరిశీలించిన అనంతరం నియామకాలకు పచ్చజెండా ఊపింది. భర్తీ చేయనున్న 5,000 పోస్టుల్లో సివిల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 148, ఆర్మ్డ్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 14, తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 12, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 3, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 23 పోస్టులు ఉన్నాయి. అలాగే, సివిల్‌ కానిస్టేబుల్‌ 3,697, ఆర్మ్డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌ 1,052, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ కానిస్టేబుల్‌ 24, డ్రైవర్‌ కానిేస్టబుల్‌ 20, మెకానిక్‌ కానిస్టేబుల్‌ 7 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి ద్వారా ఈ పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నారు. ఇందుకోసం సంబంధిత శాఖల నుంచి స్థానిక కేడర్‌ వారీగా ఖాళీల వివరాలు, రోస్టర్‌ పాయింట్లు, విద్యార్హతలు తదితర సమాచారాన్ని ేసకరించి, వీలైనంత త్వరగా నియామక నోటిఫికేషన్‌తో పాటు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ నిర్ణయంతో పోలీసు ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు ఊరట లభించింది.

Updated Date - Jul 04 , 2026 | 05:54 AM