నల సోమనాద్రి రిజర్వాయర్ సామర్థ్యం 3 టీఎంసీలకు పెంపు
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:43 AM
నలసోమనాద్రి(గట్టు) రిజర్వాయర్ సామర్థ్యం 1.32 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచడానికి అనుమతినిస్తూ.. ఈ పనులను పాత ఏజెన్సీ(జీఆర్‌ఆర్‌ఐఐపీల్-ఎంఎ్‌సఆర్-ఎన్‌ఈసీఎల్) జాయింట్ వెంచర్‌కే అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
పాత సంస్థకే పనులు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): నలసోమనాద్రి(గట్టు) రిజర్వాయర్ సామర్థ్యం 1.32 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచడానికి అనుమతినిస్తూ.. ఈ పనులను పాత ఏజెన్సీ(జీఆర్‌ఆర్‌ఐఐపీల్-ఎంఎ్‌సఆర్-ఎన్‌ఈసీఎల్) జాయింట్ వెంచర్‌కే అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధ ర్ శుక్రవారం జీవో జారీ చేశారు. అదనపు పనుల అంచనా వ్యయం ఎస్‌ఎ్‌సఆర్ 2021-22 ధర ప్రకారం ఉంటుంది. రానున్న రోజుల్లో దీని నిర్మాణ అంచ నా వ్యయాన్ని పెంచకుండా.. ప్రస్తుతం ఉన్న ధరకే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. 2022 జనవరి 10వ తేదీన జీవో నెం.2 ద్వారా నలసోమనాద్రి రిజర్వాయర్ పనులను రూ.581 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంతో మంజూరు చేయగా... తాజాగా నిర్మాణ అంచనా వ్యయం రూ.1,781.90 కోట్లకు చేరింది.