టారిఫ్ సబ్సిడీగా రూ.14,000 కోట్లు
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:13 AM
వివిధ వర్గాలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను అందిస్తున్నందుకు గాను డిస్కమ్‌లకు రూ.14,000 కోట్ల టారిఫ్ సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం పరిపాలనపరమైన...
హైదరాబాద్, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): వివిధ వర్గాలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను అందిస్తున్నందుకు గాను డిస్కమ్‌లకు రూ.14,000 కోట్ల టారిఫ్ సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతినిచ్చింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్ జీవో జారీ చేశారు. ఈ నిధులను విడుదల చేయడానికి అనుమతినిస్తూ ఈనెల 10న ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్(బీఆర్‌వో) కూడా జారీ చేసింది. దీని ప్రకారం ప్రతినెల రూ.1166.67కోట్లను టారిఫ్ సబ్సిడీగా విద్యుత్ సంస్థలకు 12 వాయిదాల్లో విడుదల చేయనున్నారు.