అంబేడ్కర్ నూతన భవన నిర్మాణానికి రూ.108 కోట్లు మంజూరు
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:10 AM
లోయర్ ట్యాంక్‌బండ్‌లో గల డా.బీ.ఆర్ అంబేడ్కర్ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.108 కోట్లు మంజూరు చేసింది.
హైదరాబాద్, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): లోయర్ ట్యాంక్‌బండ్‌లో గల డా.బీ.ఆర్ అంబేడ్కర్ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.108 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు రాష్ట్ర షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయేందిర బోయి ఉత్తర్వులు జారీ చేశారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న పాత అంబేడ్కర్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, 12 ఏళ్ల నుంచి వినియోగంలో లేదని ఆ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి నివేదించారు. దీనిని సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌లతో పాటు 10 అంతస్తుల కొత్త భవనంగా నిర్మించాలంటూ ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ఆర్కిటెక్చరల్, నిర్మాణ సేవల కన్సల్టెన్సీకి రూ.25 కోట్లు కలిపి మొత్తం రూ.108 కోట్లను ఇవ్వాలని కోరడంతో ప్రభుత్వం మంజూరు చేసింది.