ప్రజాపాలన పర్యవేక్షణకు నోడల్ అధికారులు
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:37 AM
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికపై 99 రోజుల కార్యాచరణ అమలును పర్యవేక్షించడానికి ఉమ్మడి జిల్లాలకు నోడల్ అధికారులను నియమించామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు...
వ్యవసాయ మంత్రి తుమ్మల
హైదరాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికపై 99 రోజుల కార్యాచరణ అమలును పర్యవేక్షించడానికి ఉమ్మడి జిల్లాలకు నోడల్ అధికారులను నియమించామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు వ్యవసాయశాఖ డైరెక్టర్ బి.గోపి, మహబూబ్‌నగర్‌కు ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్‌భాషా, నల్లగొండకు మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, మెదక్‌కు రాష్ట్ర సహకారశాఖ కమిషనర్ రాహుల్‌రాజ్, నిజామాబాద్‌కు మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివా్‌సరెడ్డి, ఖమ్మంకు విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ కిరణ్‌కుమార్, ఆదిలాబాద్‌కు ఆగ్రోస్ ఎండీ రాములు, కరీంనగర్‌కు గిడ్డంగుల సంస్థ ఎండీ కొర్ర లక్ష్మీ, వరంగల్‌కు హాకా ఎండీ చంద్రశేఖర్‌రెడ్డిని నోడల్ అధికారులుగా నియమించినట్లు శుక్రవారం తెలిపారు. మే 10వ తేదీ వరకూ జరిగే ఈ కార్యక్రమంలో రైతులకు సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ, నానో యూరియా వినియోగం, వానాకాలం పంటల సాగు, బ్యాంకర్లతో రుణ మేళాలు, రైతు-శాస్త్రవేత్తల సమావేశాలు, ఉత్తమ రైతులకు సన్మానం, రైతు మేళాలు నిర్వహించాలని పేర్కొన్నారు.