Share News

‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’పై సమీక్షకు జిల్లాల వారీగా ప్రత్యేకాధికారులు

ABN , Publish Date - Jun 20 , 2026 | 05:00 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’పై సమీక్ష కోసం జిల్లాల వారీగా సీనియర్‌ ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులుగా నియమించింది.

‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’పై సమీక్షకు జిల్లాల వారీగా ప్రత్యేకాధికారులు

  • సీఎం రేవంత్‌ ఆదేశాలతో నియమించిన సర్కారు..

  • 27లోపు సందర్శనలను పూర్తి చేసి, నివేదికలివ్వాలని ఆదేశం

  • ప్రజా సమస్యల పరిష్కారానికి సిఫార్సులు, సాధించిన విజయాలపై పీపీపీపీ బుక్‌లెట్స్‌ను రూపొందించాలని దిశానిర్దేశం

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’పై సమీక్ష కోసం జిల్లాల వారీగా సీనియర్‌ ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులుగా నియమించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నెల 27లోపు ఈ స్పెషలాఫీసర్లు తమ జిల్లా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసి, ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక (పీపీపీపీ)’ కార్యక్రమం విషయంలో పరిశీలించిన అంశాలు, అవసరమైన సిఫార్సులతో నివేదికలను సమర్పించాలని సర్కారు ఆదేశించింది. సాధించిన విజయాలపై పీపీపీపీ బుక్‌లెట్స్‌ను రూపొందించాలని సూచించింది. ఈ ఏడాది మార్చి 16 నుంచి జూన్‌ 12 వరకు ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయుల్లో పీపీపీపీ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి సమగ్ర నివేదికను తెప్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో క్రియాశీలకంగా పాల్గొన్న శాఖలను ఆయన అభినందించారు. అదే సందర్భంలో సీనియర్‌ ఐఏఎ్‌సలను ప్రత్యేకాధికారులుగా నియమించి, పీపీపీపీపై నివేదికను రూపొందించాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు జయేశ్‌ రంజన్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాకు వికా్‌సరాజ్‌, రంగారెడ్డికి సవ్యసాచి ఘోష్‌, మెదక్‌కు వాణీప్రసాద్‌, యాదాద్రి భువనగిరికి బీఎండీ ఎక్కా, వికారాబాద్‌కు నవీన్‌ మిట్టల్‌, మహబూబ్‌నగర్‌కు దానకిశోర్‌, సిద్దిపేటకు అహ్మద్‌ నదీం, రాజన్న సిరిసిల్లకు శైలజా రామయ్యర్‌, భూపాలపల్లికి ఎన్‌.శ్రీధర్‌, కరీంనగర్‌కు సందీప్ కుమార్‌ సుల్తానియా, సంగారెడ్డికి క్రిస్టినా జెడ్‌ చోంగ్తు, ఆసిఫాబాద్‌కు సోనిబాలాదేవి, నిజామాబాద్‌కు యోగితారాణా, పెద్దపల్లికి డీఎస్‌ లోకేశ్‌కుమార్‌, నాగర్‌కర్నూల్‌కు బి.షఫియుల్లా(ఐఎఫ్ఎస్‌), హనుమకొండకు టీకే శ్రీదేవి, వరంగల్‌కు బాలమాయాదేవి, కొత్తగూడెం ఇ.శ్రీధర్‌, నల్లగొండకు గౌరవ్‌ఉప్పల్‌, నిర్మల్‌కు ఇళంబర్తి, సూర్యాపేటకు కె.సురేంద్ర మోహన్‌, కామారెడ్డికి విజయేంద్ర, జనగామకు ఎ.శ్రీదేవసేన, నారాయణపేట్‌కు, హరిచందన దాసరి, మంచిర్యాలకు దివ్య దేవరాజన్‌, ఆదిలాబాద్‌కు రాజీవ్‌గాంధీ హనుమంతు, జోగులాంబ-గద్వాల్‌కు శ్రుతి ఓఝా, జగిత్యాలకు సిక్తా పట్నాయక్‌, వనపర్తికి వీపీ గౌతం, మహబూబాబాద్‌కు హరీశ్‌, ములుగుకు జెండగె హనుమంతు కొండిబా, ఖమ్మంకు అనుదీప్‌ దురిశెట్టిలను ప్రత్యేకాధికారులుగా నియమించింది.

Updated Date - Jun 20 , 2026 | 05:00 AM