రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి
ABN , Publish Date - Apr 30 , 2026 | 05:28 AM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య భద్రతా సలహాదారుగా బి.శివధర్‌రెడ్డిని నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి గురువారం రిటైర్ అవుతున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య భద్రతా సలహాదారుగా బి.శివధర్‌రెడ్డిని నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి గురువారం రిటైర్ అవుతున్నారు. క్యాబినెట్ ర్యాంకు పదవిలో ఆయన్ను నియమించనున్నట్లు తెలుస్తోంది. పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పనిచేయడంతో పాటు ఇంటెలిజెన్స్ విభాగంలో పూర్తి అనుభవం ఉన్న శివధర్ రెడ్డి సేవలు పదవీ విరమణ తర్వాత సైతం అవసరమని ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఆయన్ను ముఖ్య భద్రతా సలహాదారు హోదాలో నియమించనున్నారని గతంలోనే ఆంధ్రజ్యోతి ప్రచురించిన సంగతి తెలిసిందే.