నేటి నుంచి అంగన్‌వాడీల వేళల్లో మార్పు
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:13 AM
రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల పనివేళల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎండల తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు అంగన్‌వాడీ కేంద్రాలను...
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల పనివేళల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎండల తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు అంగన్‌వాడీ కేంద్రాలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు (ఒంటిపూట) మాత్రమే నిర్వహించాలని మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఆదేశించారు. మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటించారు.