Share News

పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ: భట్టి

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:10 AM

తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు

పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ: భట్టి
bhatti

హైటెక్‌సిటీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఐటీ, ఫార్మా, ఏఐ నుంచి తయారీ రంగం వరకు.. అలాగే పల్లె నుంచి పట్నం వరకు ఆర్థికాభివృద్ధి చేసేందుకు నూతన ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. సమాఖ్య చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో గురువారం హైటెక్స్‌లో గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌ ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని తెలుగు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, విద్యుత్‌, నీరు సహా అనుమతులన్నీ కల్పిస్తామని, పెట్టుబడిదారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌ బాబు సహా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు. కాగా వికసిత భారత్‌ -2047 లక్ష్యసాధనలో పారిశ్రామికవేత్తల పాత్ర కీలకమని కేంద్ర మంత్రి భగీరథ్‌ చౌదరి అన్నారు. మహిళాసాధికారతకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కొత్త తరాన్ని పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 05:11 AM